ఎఱ్ఱపహాడ్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొని నివాళులర్పించారు. వక్తలు ఆయన సేవలను కొనియాడుతూ సమానత్వానికి పూలే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహించారు.