లింగంపేట మండలం శెట్ పల్లి అయ్యపల్లి గ్రామాల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న ప్రభు స్వామి ఆలయం వద్ద బుధవారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా సాగింది. ఆలయం వద్ద కొండాపూర్ గ్రామానికి చెందిన చరణ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు మొక్కులు తీర్చుకున్నారు.