ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ నిధులు 4కోట్లు వెచ్చించి, పాత బస్టాండ్ కూల్చివేసి, కొత్తబస్స్టాండ్ నిర్మించారు. మధ్యలో బిల్లులు రాక పనులు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ బిల్లులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తిచేయించారు. ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. కొత్త బస్ స్టాండ్ కు, బస్ డిపో మంజూరు చేయించాల్సిన అవసరముంది.