ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా ప్రయగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో గురువారం 4వ రోజున త్రివేణి సంగమం వద్ద కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వీహెచ్‌పీ భజరంగ్ దళ్ కార్యకర్తలు తులసీదాస్, వినోద్ కుమార్, మోహన్, బన్నీ, శశి లు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం నుంచి ఫోన్ లో మాట్లాడుతూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు వెళ్లడం పూర్వజన్మ సుకృతమన్నారు.