నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను శనివారం స్థానిక జడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉంది, బస్టాండ్ పైకప్పు పెచ్చులూడిపోయి కింద పడుతున్నాయని దీనితో ప్రయాణికులు బస్టాండ్ లోకి వెళ్లలేక పోతున్నారని అన్నారు. బస్టాండ్ పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉండడం వల్ల ఆర్టీసీ బస్సులు లోపలికి రావడం లేదన్నారు.