వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన కంగనా రౌనత్ (వీడియో)

94చూసినవారు
భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. తాజాగా మండి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాన్ని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పరిశీలించారు. జిల్లాలోని తునాగ్‌లో వరద బాధితులతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వరదలతో ధ్వంసమైన పలు నివాస గృహాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా మండి జిల్లాలో మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. ఈ నేపథ్యంలోనే మండి జిల్లాలో ఆమె పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్