మంచు విష్ణు నటిస్తున్న 'కన్నప్ప' సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే నిన్న విడుదల కావాల్సిన ఈ ట్రైలర్.. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంతాపంగా వాయిదా వేసినట్లు సమాచారం. “హర్ హర్ మహాదేవ్” అంటూ ట్రైలర్‌పై అంచనాలు పెంచిన విష్ణు.. జూన్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.