కాంతార చాప్టర్-1 మూవీపై రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇటీవల ఓ జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ సెట్స్‌లో పడవ ప్రమాదం జరిగిందని.. అందులో 30 మంది నీటిలో గల్లంతు అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ స్పందించారు. ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేం మాణి నది ఒడ్డున ఓ సెట్ వేశాం. గాలికి ఆ సెట్ కాస్త డ్యామేజ్ అయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు’ అంటూ పేర్కొన్నారు.