ఇంటర్మీడియట్ విద్యాధికారిని కలిసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

78చూసినవారు
ఇంటర్మీడియట్ విద్యాధికారిని కలిసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
ఇటీవల కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (FAC)గా బాధ్యతలు స్వీకరించిన వి.గంగాధర్ ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వారి కార్యాలయంలో గంగాధర్ కి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన వి.గంగాధర్ ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బోర్డు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, బోర్డు నియమ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ కరీంనగర్ జిల్లా పేరును మరింతగా పెంచుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల ప్రిన్సిపాల్స్ మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్