సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన అల్ఫోర్స్ విద్యార్థులు

72చూసినవారు
సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన అల్ఫోర్స్ విద్యార్థులు
అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు సీబీఎస్ఈ 10 మరియు 12వ తరగతి ఫలితాల్లో జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ట్రైనిటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి మాట్లాడారు. అల్ఫోర్స్ ఆరంభం నుండి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
10వ తరగతి ఫలితాల్లో మహమ్మద్ షాజ్నెన్ తబాసుమ్ 99.4% (497 మార్కులు) సాధించి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానం సంపాదించడమే కాకుండా జిల్లా స్థాయిలోనూ ప్రథముడిగా నిలిచారు. ఎం.సుచీత్ రెడ్డి (98.6%), జె.సుప్రభ (98.4%), ఆర్.వేదిక మరియు టి.హార్షిని (98.2%) వంటి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. మొత్తం మీద పలువురు విద్యార్థులు 480 నుండి 490 మార్కుల మధ్య సాధించి సత్తా చాటారు.
12వ తరగతి ఫలితాల్లో వి.సంజీత రెడ్డి మరియు ఎన్. అనిరుద్ సాయి ఇద్దరూ 96.4% (482 మార్కులు) సాధించి అగ్రస్థానంలో నిలిచారు. వి.శశాంక్ రెడ్డి (95.6%), జె.వమీకా మరియు ఇ.మృనాలిని (94.6%) కూడా అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో ఉన్నారు. ఈ సంవత్సరం 12వ తరగతిలో 13 మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషమన్నాడు. విద్యార్థుల యొక్క అద్భుతమైన విజయం వెనుక ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రుల యొక్క కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఇటువంటి విజయాలు భవిష్యత్తులో మరింత స్ఫూర్తినిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్