అల్ఫోర్స్ విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఒలంపియాడ్లలో ప్రథమ ర్యాంకులు

74చూసినవారు
అల్ఫోర్స్ విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఒలంపియాడ్లలో ప్రథమ ర్యాంకులు
విద్యార్థులకు ప్రాధమిక దశ నుండే వివిధ పోటీ పరీక్షలలో ముఖ్యంగా ఒలంపియాడ్లలో పాల్గొనే విధంగా ప్రోత్సాహం అందించాలని తద్వారా వారికి వివిధ అంశాలలో పట్టు వస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి వివిధ రాష్ట్ర స్థాయి ఒలంపియాడ్ పోటీలలో ప్రథమ ర్యాంకులు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్యఅతిధిగా హాజరై వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే వివిధ సంస్థల వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతిభా పాటవ పోటీలలో పాల్గొనే విధంగా వనరులను అందించాలని చెప్పారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థుల పోటీ తత్వాన్ని అలపర్చడంలో కృషి చేయాలని మరియు ఉపాధ్యాయులకు తోడ్పాటునందించి వారి పిల్లల సర్వతోముఖాభివృద్ధియే ప్రధాన ధ్యేయంగా ఉండాలని వారు కోరారు. ఈ క్రమంలో పాఠశాల స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను ఇటీవలకాలంలో ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ అయిన శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ మరియు రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఒలంపియాడ్లలో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని హర్షం వ్యక్తం చేస్తు విజేతలందరికి పుష్ప గుచ్చాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. పాఠశాలకు చెందినటువంటి పి. శ్లోక, 9వ తరగతి, ఇంగ్లీష్ ఒలంపియాడ్లో స్టేట్ 1వ ర్యాంక్, యం.డి అబ్దుల్ అర్హాన్, 7వ తరగతి, జనరల్ నాలెడ్జ్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంక్, జి. సాయి సంహిత్, 9వ తరగతి, మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంకు, యం. శివేన్ రెడ్డి, 8వ తరగతి, మ్యాథ్స్ ఒలంపియాడ్ లో స్టేట్ 4వ ర్యాంకు, డి. స్నిగ్దాశ్రీ, 5వ తరగతి, మ్యాథ్స్ ఒలంపియాడ్ స్టేట్ 1వ ర్యాంకు, ఎ. వాన్మయి, 5వ తరగతి, మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ తరగతి మరియు కె. సాన్వి, 5వ తరగతి, సైన్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ ర్యాంకుతో టాపర్స్ నిలిచారని మరియు ఇతర విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్