నేడు ప్రకటించిన NEET 2025 ఫలితాలలో అల్ఫోర్స్ NEET అకాడమీ విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించి, మరోసారి తమ విజయ పరంపరను కొనసాగించారు. వి. శశాంత్ రెడ్డి 599 మార్కులు సాధించగా, బి. వర్షిత్ 556, అదిబా పిరోజ్ 553, జె. మైథిలి 535, యమ్.డి. అఫ్నాన్ 513, బి. భువనకృతి 508, ఏ. సాత్విక 507, జె. అనూష 500 మార్కులు సాధించారు. "DOCTORS-30" ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా నీట్ కోచింగ్ అందిస్తున్న అల్ఫోర్స్ ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఎనిమిది మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. సుమారు 100 మంది విద్యార్థులు దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లో సీట్లు పొందుతారని అల్ఫోర్స్ అకాడమీ ప్రకటించింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పటిష్టమైన విద్యా ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంఠిత దీక్ష, పట్టుదల, కృషి వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. తక్కువ మంది విద్యార్థులతో ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించడం అల్ఫోర్స్ విజయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు. నీట్ అయినా, ఐఐటీ అయినా విద్యార్థులను విజయ మార్గంలో నడిపిస్తున్న సంస్థ అల్ఫోర్స్ అని, ఇప్పటివరకు ప్రకటించిన అన్ని ఫలితాలలోనూ తాము ముందంజలో ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న అల్ఫోర్స్‌ను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను చేర్పిస్తున్న తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో అత్యధిక మంది విద్యార్థులను వైద్య, ఐఐటీ మరియు ఎన్ఐటీలలో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని డా. నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.