రామడుగు: పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి హంగామా

83చూసినవారు
రామడుగు: పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి హంగామా
రామడుగు మండల కేంద్రానికి చెందిన శివరాంకు జగిత్యాలకు చెందిన జమునతో మూడేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి జమున శివరాంను వదిలిపోయింది. తన భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం శివరాం మద్యం సేవించి, జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో బీరు సీసాతో తన తలకు గాయం చేసుకున్నాడు. ఈ ఘటనలో గాయపడిన శివరాంను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్