కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి మల్యాల మండలం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురు ఎదురుగా ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.