చొప్పదండి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది మంది కరీంనగర్, హైదరాబాద్, ధర్మారం, మంచిర్యాల తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారని, షెల్టర్ లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు. బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని మంగళవారం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.