అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు యువకులు. చొప్పదండి పట్టణానికి చెందిన కే సుభాష్ కు ప్రతిమ హాస్పిటల్ నగనూరులో హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. తనకు ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని తెలుపగా పట్టణానికి చెందిన తాటిపల్లి మణి సాయి, రాము వెంటనే స్పందించి శనివారం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.