చొప్పదండి: మంచినీటి పైపు లైన్ లీకేజ్ తో ఇబ్బందులు

61చూసినవారు
చొప్పదండి: మంచినీటి పైపు లైన్ లీకేజ్ తో ఇబ్బందులు
చొప్పదండి మున్సిపాలిటీ ఆరో వార్డులో పాత వెదురుగట్ట దారిలో మంచినీటి పైపు లైన్ లీకేజ్ అయ్యి రెండు నెలలు కావస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపించారు. లీకేజీ నీరు దారిపై నిలుస్తున్నదని.. ఇంతే కాక నీటి సరఫరాకు కూడా అంతరాయం జరుగుతున్నదని అన్నారు. సమస్యను మున్సిపాలిటీ కమిషనర్, సిబ్బందికి తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్