
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సమర్థించారు. అణు ఒప్పందం విషయంలో సమయం ఇచ్చినప్పటికీ ఇరాన్ స్పందించకపోవడం వల్లే ఈ దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు 60 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఒప్పందంపై సంతకం చేయకపోవడం వల్ల ఇజ్రాయెల్ చర్యలు అనివార్యమయ్యాయన్నారు. డీల్ చేయకపోతే ఇరాన్ నాశనం అవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.