చొప్పదండి పట్టణానికి చెందిన రాజన్నల తిరుపతి అనే రైతు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. తన పంట పొలం వరి నారుమడిలో ఎమ్మెల్యే పేరును వినూత్నంగా వడ్ల గింజలతో రాసి అభిమానం ప్రదర్శించాడు. తిరుపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.