దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన మహానేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని చొప్పదండిలోని ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ రత్నాకర్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర, నవతరం యూత్ వెల్ఫేర్ దేశ సమైక్యత కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖర్జీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం చేశారు.