గంగాధర మండలం ఘర్షకుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం 24 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్ఞాన సరస్వతి భజన మండలి ప్రధాన సభ్యురాలు దండే రమాదేవి, ఉత్తమ గాయకుడు చీకట్ల లచ్చయ్య, జాతీయస్థాయి అవార్డు గ్రహీత గాజుల రాజు, ప్రముఖ గాయకుడు గడ్డం రమేష్, దండే రవీందర్, తదితరులు పాల్గొన్నారు. భజన పాటలతో అలరించిన వీరిని ఆలయ కమిటీ అభినందించింది.