వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి మండలం గుమ్మలాపూర్, వెదురుగట్ట గ్రామాల్లో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాల గురించి రైతులకు నేరుగా శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ప్రియదర్శిని, ఏఓ వంశీకృష్ణ, ఏఈఓ లు సాయి ప్రసన్న, సంపత్ తదితరులు పాల్గొన్నారు.