చొప్పదండి మండలం గుమ్లపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొన్ని రోజులుగా డ్రైనేజీని శుభ్రం చేయకుండా అలాగే వదిలేశారు. డ్రైనేజీ మొత్తం కూలిపోయిన అందులోకి వ్యర్థ పదార్ధాలు, నీళ్లు వదులుతున్నారు. నీళ్లు అక్కడే నిలిచిపోయి అందులో దుర్వాసనతో దోమలు వస్తున్నాయి. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు బుధవారం కోరారు.