చొప్పదండి శివకేశవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శివ కేశవాలయాలు రెండు ఎదురెదురుగా ఉంటాయి. కళ్యాణి చాళుక్య ప్రభువు కాలంలో దేవకబ్బే అనే మహిళ క్రీ. శ. 1009లో చేసిన ఒక శాసనమే ఈనాటి శివకేశవ ఆలయం. ఈ శాసనం దేవకబ్బే రూపొందించిందని ఆనాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ రకంగా శంభుని గుడికి (శివకేశవ ఆలయం) 1017 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరిగే జాతరకు ప్రజలు వేలాదిగా వచ్చి దర్శించుకుంటారు.