ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వాములు ఇరుముడితో అంజన్నను దర్శించుకొని, స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు కపిందర్, లక్షణ్ కలిసి 11, 21, 41, అర్ధమండల మాల విరమణ చేశారు. అనంతరం భక్తులు కల్యాణకట్ట చేరుకొని తలనీలాలు సమర్పించారు. తదుపరి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ పరిసరాలలోని ఇతర ఉప ఆలయాలను దర్శించుకున్నారు.