ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. పవిత్రోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఉదయం నుండే కొండపైకి చేరుకున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకుని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.