అనంతపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు 172, రేషన్ కార్డులు 22, రైతు భరోసా 478, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 27 అర్గులకు మంజూరు పత్రాలు ఆదివారం అందజేశారు. ఇట్టి పథకాలు నిరంతర ప్రక్రియ అని జెడ్పి సీఈఓ వినోద్ స్పష్టం చేశారు. ఇంకా ఆయా గ్రామాల్లో పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోని వారు ఉంటే సంబంధిత కార్యాలయాల్లో అర్జీలు అందజేయాలని సూచించారు. మండల అధికారులు పాల్గొన్నారు.