చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు దూర ప్రాంతాల నుంచి పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ దీక్షాపరులకు (స్వాములకు) మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు గుండేటి చందు ముత్యంపేటలో పండ్లు, మినరల్ వాటర్ శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, పన్నాటి మల్లేశం, చిలువేరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.