గంగాధర: చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాను: ఎమ్మెల్యే

63చూసినవారు
గంగాధర: చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాను: ఎమ్మెల్యే
గంగాధర మండలంలోని కొండనపల్లి, హిమ్మత్నగర్, గట్టుభుత్కూర్, ఆచంపల్లిలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రారంభించారు. రైతులు తగిన తేమశాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొని వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. చివరి ధాన్యగింజ వరకు కొనుగోలు చేస్తామని బుధవారం వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులున్నారు.

సంబంధిత పోస్ట్