చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన ఎడ్ల తేజసాయిశ్రీ (30) అనే వివాహిత గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. ఈనెల 5న రాత్రి భర్తకు ఇంటికి రాలేదని, 6న భర్తతో గొడవ పెట్టుకుంది. మనస్థాపంతో క్షణికావేశంలో అదే రోజు ఉదయం గడ్డి మందు తాగింది. చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.