కొడిమ్యాలలో ఒంటిపై డీజిల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన నాంపల్లి చంద్రయ్య అనే వ్యక్తి అంగడి బజార్ చౌరస్తాలో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని అడ్డుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదాల కారణంగానే చంద్రయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఎస్సె సందీప్ తెలిపారు.