చొప్పదండిలో ఆదివారం భారత మినీ డోర్ ఆటో యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా చొక్కల లక్ష్మణ్, అధ్యక్షులుగా చొక్కాల రమేష్, ఉపాధ్యక్షుడిగా కొక్కుల కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఓలువత్తుల రవి, కోశాధికారిగా బరిబద్దల మన్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాలూరి ప్రసాద్, యామ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.