బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామ శివారులో బుధవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోజ్ పట్టుకున్నారు. ట్రాక్టర్ కు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్టు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.