నీలోజుపల్లికి చెందిన ఓ వ్యక్తి సైబర్ వల్ల చిక్కుకోగా బాధితుడు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై పృధ్విధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం నీలోజిపల్లి కి చెందిన ఎరుకల కిషన్ యొక్క కరెంట్ అకౌంట్ సిమ్ కార్డు ను గుర్తుతెలియని వ్యక్తి తీసుకొని సైబర్ నేరానికి పాల్పడి ఆకౌంటు ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినాడని దీంతో కిషన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశాడని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తిపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు