
జననాలు తగ్గుతున్నాయ్.. మరణాలు పెరుగుతున్నాయ్: నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో జననాల సంఖ్య తగ్గి, మరణాల సంఖ్య పెరుగుతోందని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)-2022 నివేదిక వెల్లడించింది. 2015లో 8.51 లక్షల జననాలు నమోదవ్వగా, 2022లో ఇవి 7.52 లక్షలకు తగ్గాయి. ఆలస్యపు వివాహాలు, కెరీర్‌పై దృష్టి వల్ల పిల్లల్ని కనడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఇక, 2018లో 3.75 లక్షల మరణాలు నమోదవ్వగా, 2022లో అవి 4.30 లక్షలకు పెరిగాయి. కరోనా వల్ల మరణాలు పెరిగినట్లు నివేదిక తెలిపింది.