ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ జాయింట్ సెక్రెటరీ వసుంధరదేవి అన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బొప్పరాతి నారాయణతో కలిసి మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ శివరామకృష్ణ పాల్గొన్నారు.