కొండగట్టు అంజన్న దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వేకువజామున కొండపైకి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో ఉప ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్య వేక్షిస్తున్నారు.