గంగాధర ఎస్సై వంశీకృష్ణ శనివారం తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మండలం నమిలి గుండిపల్లికి చెందిన గోళి వజ్రమ్మ 80 సంవత్సరాల వృద్ధురాలు తన కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, గంగాధర చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నీకు పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఆమె మెడలో ఉన్న తులం బంగారం గొలుసు, చెవుల కమ్మలు తీసుకొని పారిపోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.