హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గురువారం నిర్వహించిన మత్స్యకారుల మహా ధర్నాలో కరీంనగర్ జిల్లా మత్స్య కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సహజంగా మరణించిన మత్స్య కార్మికులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి 5000 రూపాయలు పింఛన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిట్టల వెంకటేష్, ఉపాధ్యక్షుడు నూనె శేఖర్ తదితరులు పాల్గొన్నారు.