
వీరు కోడిగుడ్లు అస్సలు తినొద్దు?
గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. అందుకే వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే గుడ్లు తినడం అందరికీ ప్రయోజనకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పచ్చసొన తినకుండా ఉండాలి. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే గుడ్లు తినవద్దు. అలాగే తామర, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు ఉన్నవారు కూడా గుడ్లు తినకుండా ఉండాలి.