బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

58చూసినవారు
బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరుగుతున్న దేశ అభివృద్ధిని వివరించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.