ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరి శివతేజ్ ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో స్పారింగ్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించాడు. ఆదివారం హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ స్పారింగ్ విభాగంలో శివతేజ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి పొందాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.