ధర్మపురి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ 18 వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించిన స్వామి వారి పడి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం విప్ ఆధ్వర్యంలో స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి దీక్షపరులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు.