ధర్మపురి: ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి కొప్పుల

79చూసినవారు
ధర్మపురి: ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్త రాజమణి ఇంట్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరిమణులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణ రెడ్డి, రామచంద్రం గౌడ్, జూపాక కుమార్, మూగల సత్యం, బిడారి తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్