ధర్మపురి: మెగా పశువైద్య శిబిరం
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లె గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ కరీంనగర్, పశు వైద్య, పశు సంవర్ధక శాఖ గురువారం సంయుక్తంగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 184 పశువులకు చూడి పరీక్షలు, పెయ్యలకు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల వెటర్నరీ డాక్టర్ లింగాల హేమలత, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి వివిధ మండలాల వెటర్నరీ డాక్టర్ లు డాక్టర్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.