మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సాయంత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలయానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.