భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. మంగళవారం గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సులో అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.