

పోచంపల్లిలో ప్రపంచ సుందరీమణుల సందడి (వీడియో)
తెలంగాణలో టూరిజం విలేజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్‌వరల్డ్ 2025 పోటీదారులు గురువారం సందర్శించారు. ప్రపంచ సుందరీమణులకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అందగత్తెలు సందర్శించారు. ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. పలువురు ప్రపంచ సుందరీమణులు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు.