జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటుకుల్ల లచ్చయ్య ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వరి వెంట పలువురు మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.