గ్రామీణ యువతకు వ్యవసాయంలో ఆధునిక శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువత ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడుతోందన్నారు. వారికి ఆధునిక పరికరాలతో వ్యవసాయాన్ని చేసే మెలకువలు నేర్పితే ముందడుగు వేస్తారన్నారు. వారికి ఆధునిక పరికరాలు, వ్యవసాయ సాగు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నారు.